Webdunia - Bharat's app for daily news and videos

Install App

`మ‌హాస‌ముద్రం`లో ధ‌నుంజ‌య్‌గా రామచంద్ర‌రాజు

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (17:09 IST)
Ramchadra raju
కన్నడ నటుడు రామచంద్రరాజు కేజీఎఫ్ సినిమాలో మెయిన్ విల‌న్ `గరుడ`గా తన అద్భుతమైన న‌ట‌న‌తో దేశవ్యాప్తంగా ఖ్యాతిని పొందారు. ప్ర‌స్తుతం యంగ్ హీరోస్ శ‌ర్వానంద్‌, సిద్దార్ధ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్న `మ‌హాస‌ముద్రం`లో ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే  విడుద‌లైన శ‌ర్వానంద్‌, సిద్దార్ధ్‌, అధితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూయేల్, జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేష్ ఫ‌స్ట్‌లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ రోజు ధ‌నుంజ‌య్‌గా రామ‌చంద్ర‌రాజు ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. భ‌య‌పెట్టేలా ఉన్న ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. తెలుగులో ఈ చిత్రం రామ‌చంద్ర‌రాజుకి మంచి బ్రేక్ ఇస్తుంద‌ని ఈ పోస్ట‌ర్ చూస్తే అర్ద‌మ‌వుతోంది.
 
ఇంటెన్స్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూల్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో న‌టిస్తున్న ఈ చిత్రం ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభంకాబోతుంది. చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేఎల్ ప్ర‌వీణ్ ఎడిట‌ర్‌, కొల్ల అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.
 
తారాగ‌ణంః
శ‌ర్వానంద్‌, సిద్ధార్ద్‌, అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూల్,జగపతి బాబు, రావు రమేష్, రామ‌చంద్రరాజు
సాంకేతిక వ‌ర్గం:
‌ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: అజ‌య్ భూప‌తి
నిర్మాత‌: సుంక‌ర రామ‌బ్ర‌హ్మం
కో- ప్రొడ్యూస‌ర్‌: అజ‌య్ సుంక‌ర‌
బ్యాన‌ర్‌: ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: కిషోర్ గ‌రికిపాటి
సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్
సినిమాటోగ్ర‌ఫి: రాజ్‌తోట
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: అవినాష్ కొల్లా
ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ కేఎల్‌
యాక్ష‌న్‌: వెంక‌ట్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments