Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నడ సినీ కార్మికులకు సాయం చేసిన కేజీఎఫ్ స్టార్ యష్

Advertiesment
కన్నడ సినీ కార్మికులకు సాయం చేసిన కేజీఎఫ్ స్టార్ యష్
, బుధవారం, 2 జూన్ 2021 (10:14 IST)
కేజీఎఫ్ స్టార్ యష్... తన స్టార్ డమ్, క్రేజ్ రేంజ్ లోనే కరోనా సాయం చేశారు. కన్నడ సినీ కార్మికులందరు ప్రతి ఒక్కరికీ రు.5 వేల చొప్పున సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. దీని మొత్తం కోటిన్నర అవుతుంది. తన సాయం ఇంతటితో ఆగదని కూడా యష్ తెలియచేశాడు. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి పనుల్లేక ఇబ్బంది పడుతున్న కన్నడ సినిమా కార్మికులకు నేనున్నానంటూ అభమిచ్చారు. 
 
ఒక్కో కుటుంబానికి రూ.5000 లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కన్నడ సినీ ఇండస్ట్రీలో 21 విభాగాల్లో పనిచేస్తోన్న దాదాపు 3 వేల మందికి ఈ ఆర్థిక సాయం అందించనున్నట్లు ట్విటర్ వేదిక తెలిపారు. నేను చేస్తున్న ఈ సాయం నష్టాన్ని పూర్తిగా పూడ్చలేదని నాకు తెలుసు. కానీ త్వరలోనే చిత్ర సీమ తిరిగి కోలుకుంటుందన్న ఆశతో నావంతు ప్రయత్నంగా ఈ కార్యక్రమం చేస్తున్నా అని యశ్ పేర్కొన్నారు.
 
ఇకపోతే.. పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ ఛాప్టర్ 2 పై అంచనాలు ఎక్కువవుతున్నాయి. మూవీకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది చిత్ర యూనిట్. ఇప్పుడు మరో అప్‌డేట్ అభిమానుల కోసం సిద్ధంగా ఉంది. 
 
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్ 1 సూపర్ డూపర్ హిట్‌తో సంచలనమైన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు సీక్వెల్‌గా కేజీఎఫ్ ఛాప్టర్ 2 తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రధాన విలన్‌గా సంజయ్ దత్ నటిస్తున్నాడు.
 
 నాయత్ ఖలీల్..అతిపెద్ద సామ్రాజ్యమైన నానాచిని  ఆక్రమించేందుకు ఎవరితో చేతులు కలుపుతాడనే ప్రశ్నలు సంధిస్తున్నారు. అంతేకాకుండా అతడు తన బర్త్‌డేని ఇండియాలో ఓ రహస్య ప్రాంతంలో జరుపుకుంటున్నాడంటూ లీక్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనూ సూద్‌పై తమ్మారెడ్డి ఏమన్నారంటే..? తెలిస్తే షాకవుతారు..!