Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ కొడుకూ తల్లికి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చుండడు...సంచలన దర్శకుడి తల్లి

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (12:39 IST)
"లక్ష్మీస్ ఎన్టీఆర్" తర్వాత వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ త్వరలో 'కోబ్రా' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇందులో మరో విశేషమేమిటంటే ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నటుడిగా సినీరంగ ప్రవేశం చేస్తున్నారు ఆర్జీవీ. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆర్జీవీ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 7న ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్జీవీ తల్లి సూర్యమ్మ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. 
 
'నేనెప్పుడూ మా రామూని కంపెనీలో అజయ్ దేవగన్ లాంటి ఏదైనా మెచ్యూర్డ్ క్యారెక్టర్ నటించమని అడుగుతూనే ఉన్నాను, కానీ ఏమీ మాట్లాడేవాడు కాదు, నేను కూడా అడిగి, అడిగి ఊరుకున్నాను" అని గుర్తు చేసుకున్నారు. అయితే ‘‘నా కోరిక తీర్చడం కోసం రామూ ఇప్పటికైనా సినిమాల్లో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పుట్టినరోజుకు నేను తనకు గిఫ్ట్ ఇవ్వడానికి బదులు తనే నాకు ఇచ్చాడు. ఇలాంటి గిఫ్ట్ ఏ తల్లీ ఏ బిడ్డ నుండి పొంది ఉండదు. ఏ కొడుకూ ఏ తల్లికీ ఇచ్చి ఉండడు.. బహుశా నేనే మొదటి వ్యక్తి కావచ్చేమో'' అని పేర్కొన్నారు.
 
ఇక పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కసాకసా ఇష్టమొచ్చినట్లు పొడిచి, తనలోని విలనిజం హావభావాలను పలికిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఆర్జీవీ తన పుట్టినరోజులంటే చిరాకని, ఒక్కో పుట్టినరోజు వస్తోందంటే ఒక సంవత్సరం ఓల్డ్ అయిపోతున్నామనే భయం, చావుకు దగ్గరపడుతున్నామనే ఫీలింగ్ నాకు ఉంటాయని అన్నారు. కేవలం పుట్టినందుకు కాకుండా ఏదైనా సాధించిన రోజున సెలబ్రేట్ చేసుకోవడంలో ఎక్కువ అర్థం ఉంది. అయితే ఈ పుట్టినరోజును నా వాళ్ల కోసం చేసుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
 
'కోబ్రా' చిత్రానికి రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్జీవీ గన్ షాట్ ఫిల్మ్స్ పతాకంపై డిపీఆర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆర్జీవీతో పాటుగా అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఆర్జీవీ ఇంటిలిజెన్స్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది పూర్తి హీరోయిజం కలిగిన పాత్రలా ఉంటుందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments