Webdunia - Bharat's app for daily news and videos

Install App

'యురి' మూవీ సర్జికల్ స్ట్రైక్స్ అదిరిపోయింది.. రూ.250 కోట్ల క్లబ్‌లోకి...

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (12:35 IST)
పాకిస్థాన్ ప్రేరిపిత ఉగ్రవాదులు భారత్‌లోని యురి ప్రాంతంలో జరిపిన దాడులకు ప్రతీకారంగా భారత సైన్యం మెరుపు దాడులు (సర్జికల్ స్ట్రైక్స్) నిర్వహించింది. ఈ దాడుల నేపథ్యంలో నిర్మించిన చిత్రం యురి. ఈ చిత్రాన్ని కేవలం 42 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ చిత్రం ఇప్పటివరకు బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్టు బాలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం. ఫలితంగా 2019లో అత్యధిక వసూళ్లు రాబటిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 
నిజానికి ఈ యేడాది ఆరంభం నుంచే బాలివుడ్ ఫిల్మ్ మేకర్స్ ప్రయోగాలకి పెద్దపీట వేశారని చెప్పొచ్చు. మూడు నెలల్లో విభిన్న కథాంశాలతో ముందుకు వచ్చిన చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. పూర్తి వినోదాత్మకంగా రూపొందిన 'టోటల్ ధమాల్', మ్యూజికల్ డ్రామా 'గల్లీబాయ్', వెరైటీ లవ్ స్టోరీ 'లుక్కా చుప్పి', థ్రిల్లర్ మూవీ 'బద్లా' ఈ నాలుగు సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా ఈ చిత్రాలు రూ.వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి. 
 
అలాగే, పలు ఆటంకాలను దాటుకుని జనవరి 25వ తేదీన విడుదలైన మణికర్ణిక సినిమా కూడా హిట్ అయ్యింది. కంగనా రనౌత్ పెర్ఫార్మెన్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మణికర్ణిక రూ.వంద కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. మార్చిలో రిలీజైన 'కేసరి' సినిమా కూడా రూ.వంద కోట్లు వసూల్ చేసి హిట్టు సినిమాగా నిలిచింది. ఇలా మూడు నెలల్లో ఆరు హిందీ సినిమాలు రూ.వంద కోట్లకి పైగా వసూళ్లు కొల్లగొట్టాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికను నగ్న వీడియో తీసి... తల్లిని శారీరకంగా లోబరుచుకున్న కామాంధుడు...

విమానంలో వీరకుమ్ముడు... వీడియో వైరల్

పద్మ పురస్కారాలకు ఎంపికైనవారికి హృదయపూర్వక అభినందనలు

పొరుగింటి మగాడితో పడక సుఖానికి బానిసైన భార్య.. అడొస్తున్న భర్తను చంపేసింది..

Happy 76th భారత గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments