Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఎవరు అడ్డుకున్నారో తెలుసు : రాంగోపాల్ వర్మ

Webdunia
బుధవారం, 1 మే 2019 (16:47 IST)
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఎవరు అడ్డుకున్నారో ప్రతి ఒక్కరికీ తెలుసుని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌ప్ప మిగ‌తా అంత‌టా విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. 
 
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సెన్సార్ బోర్డు చిత్ర విడుదలను నిలిపేసిన విషయం తెలిసిందే. అన్ని చిక్కులను దాటి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లో మే 1వ తేదీన లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలవుతుందని వ‌ర్మ త‌న ట్విట్ట‌రులో పేర్కొన్నాడు. 
 
కానీ, ఇప్పుడు కూడా సినిమా విడుద‌ల‌కాలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈ చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వొద్దంటూ ఎన్నికల సంఘం అన్ని జిల్లా ఎస్పీ, కలెక్టర్లు ఆదేశాలు జారీచేసింది. 
 
ఈ నేపథ్యంలో గ‌తంలో ఏపీ హైకోర్టు తీర్పుతో పాటు ఈసీ ఇచ్చిన లేఖ‌ని జ‌త చేసిన వ‌ర్మ న్యాయ ప‌రంగా ఈ విష‌యంపై పోరాడ‌తాన‌ని త‌న ట్వీట్‌లో తెలిపాడు. పోలింగ్ పూర్తైన త‌ర్వాత సినిమాని విడుద‌ల చేసుకోవ‌చ్చనే ఉత్త‌ర్వులు రావ‌డంతో త‌మ సినిమా రిలీజ్‌కి ఏర్పాట్లు చేసుకున్నాడు.
 
కానీ, మ‌ళ్ళీ ఈ చిత్ర విడుద‌ల‌కి అడ్డుప‌డ‌డంతో ఇలా ఎవ‌రు చేస్తున్నారో, అంద‌రికి తెలుసంటూ వ‌ర్మ త‌న ట్వీట్‌లో ఆవేద‌న వెళ్ళ‌బుచ్చాడు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jubilee Hills: మూడు సర్వేలు, 3 అభ్యర్థులు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఆ అభ్యర్థి ఎవరు?

అత్యవసర పరిస్థితి ఉంటే జగన్ ఇలా తిరుగుతుంటాడా?... పైలట్ కన్నీళ్లు పెట్టుకున్నాడు?

మోహన్ బాబు - మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments