తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని సాధినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్మను ఓ సైకో డైరెక్టరుగా పేర్కొంది.
ఇటీవల విజయవాడలో తాను నిర్మించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ విడుదలకు సంబంధించిన విషయాలు వెల్లడించేందుకు రాంగోపాల్ వర్మ ప్రయత్నించారు. అయితే, ఆయన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుని ఎయిర్‌పోర్టు నుంచే ఆయన్ను బలవంతంగా విమానం ఎక్కించి హైదరాబాద్‌కు పంపించివేశారు. దీంతో ఏపీ సర్కారుపై రాంగోపాల్ వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనకు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా వత్తాసు పలికారు.
ఈ పరిణామాలపై యామిని సాధినేని మాట్లాడుతూ, ఆర్జీవీ సైకో డైరెక్టర్ అంటూ మండిపడ్డారు. అలాంటి సైకోకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇలాంటి వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆమె జోస్యం చెప్పారు.