రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రం హంపిలో ప్రారంభం

డీవీ
మంగళవారం, 2 జులై 2024 (11:44 IST)
movie team at hampi
గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ థియేట‌ర్లలో నేచురల్ హైస్ ఇచ్చే పాత్ బ్రేకింగ్ చిత్రాల‌ను నిర్మించడానికి ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి అడుగుపెడుతున్నారు. 'వి మెగా పిక్చర్స్' బ్యానర్ పై రూపొందనున్న సినిమాలకు యూవీ క్రియేషన్స్‌ విక్రమ్ రెడ్డి ప్రొడక్షన్ పార్ట్నర్. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి సెన్సేషనల్ చిత్రాలను రూపొందించడంలో పేరుగాంచిన నిర్మాణ సంస్థ, మరో సంచలనాత్మక చిత్రం ది ఢిల్లీ ఫైల్స్ నిర్మాణ భాగస్వామిగా వుంది. ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ నేటి నుండి మొదలైంది. 
 
గతంలో కార్తికేయ 2 కోసం విజనరీ ప్రొడ్యూసర్‌గా ప్రశంసలు అందుకున్న అభిషేక్ అగర్వాల్‌తో కలిసి పని చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, గ్లోబల్ ఫోర్స్ గా పేరు పొంది, దేశం గర్వించేలా చేసిన రామ్ చరణ్‌తో చేతులు కలిపారు. రామ్ వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ 'ది ఇండియా హౌస్'. సాయి మంజ్రేకర్ హీరోయన్ గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
 
తమ ప్రతిష్టాత్మక చిత్రం 'ది ఇండియా హౌస్' ప్రారంభమైనట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 1905 బ్యాక్ డ్రాప్ లో లవ్, రెవెల్యుషన్ థీం ని ఎక్స్ ఫ్లోర్ చేసే ఈ పీరియడ్ డ్రామా కోర్ టీం సమక్షంలో హంపి (కిష్కింద)లోని విరూపాక్ష దేవాలయంలో గ్రాండ్ గా పూజా కార్యక్రమం జరిగింది. 
 
 టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాలో పని చేస్తున్నారు. కెమరూన్ బ్రైసన్ డీవోపీ కాగా, విశాల్ అబానీ ప్రొడక్షన్ డిజైనర్.
 ఈ ఎపిక్ మూవీకి సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
 నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, సాయి మంజ్రేకర్, అనుపమ్ ఖేర్    

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశాన్ని నాశనం చేస్తున్నారు... పాక్ ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ ధ్వజం

ఢిల్లీ రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్ - మోస్ట్ వాంటెండ్ సిగ్మా గ్యాంగ్‌స్టర్లు హతం

బాలికను మూత్ర విసర్జనకు సపోటా తీసుకెళ్లిన నిందితుడు ఆత్మహత్య

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్

టెక్ సిటీలో బెంగుళూరులో వెస్ట్ బెంగాల్ మహిళపై గ్యాంగ్ రేప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments