Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అజిత్ కుమార్.. విడాముయ‌ర్చి ఫ‌స్ట్ లుక్ - ఆగ‌స్ట్ లో చిత్రీక‌ర‌ణ‌ పూర్తి

Advertiesment
Ajith Kumar

డీవీ

, సోమవారం, 1 జులై 2024 (07:02 IST)
Ajith Kumar
అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘విడాముయ‌ర్చి’. ఈ క్రేజీ కాంబోలో  సినిమా అన‌గానే అభిమానులు స‌హా అంద‌రిలో సినిమాపై భారీ అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. అస‌లు సినిమాలో అజిత్ లుక్ ఎలా ఉంటుంది.. మూవీ ఎలా ఆక‌ట్టుకోనుందంటూ అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూడ‌సాగారు. ఆ స‌మ‌యం వ‌చ్చేసింది.. అంద‌రి అంచ‌నాల‌ను మించేలా ‘విడాముయ‌ర్చి’ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.
 
‘విడాముయ‌ర్చి’ సినిమా ప్రారంభం నుంచి కోలీవుడ్ స‌హా అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. టాప్ స్టార్స్‌, టెక్నీషియ‌న్స్ అందరూ ఈ సినిమాలో భాగ‌మ‌య్యారు. ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో స్టార్స్‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాలు, డిఫ‌రెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాల‌ను నిర్మిస్తోన్న టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ సంస్థ అధినేత సుభాస్క‌ర‌న్..‘విడాముయ‌ర్చి’ సినిమాను నిర్మిస్తున్నారు. ఆద్యంతం ఆక‌ట్టుకునే ఎంట‌ర్‌టైన్మెంట్ చిత్రాల‌తో పాటు విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడిగా పేరున్న మ‌గిళ్ తిరుమేని అజిత్‌తో భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.
 
అజిత్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్ కుమార్‌, త్రిష‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్ త్ర‌యం త‌మదైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇప్పుడు మ‌రోసారి వీరు ముగ్గురు ఆడియెన్స్‌ను మెప్పించ‌నున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఆర‌వ్‌, రెజీనా క‌సాండ్ర‌, నిఖిల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.
 
ఈ సంద‌ర్భంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్ జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా విడాముయ‌ర్చి చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఇప్పుడు విడుద‌ల చేయ‌టం మా అంద‌రికీ ఎంతో ఆనందంగా ఉంది. అజిత్‌తో సినిమా చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి అభిమానులు, ప్రేక్ష‌కులు వారి స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. వారికి చ‌క్క‌టి సినిమాను అందించ‌టమే మా ల‌క్ష్యం. అందుక‌నే మా టీమ్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఆగ‌స్ట్ నెల‌లో సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తాం. త‌ర్వాతే సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుంద‌నే దాని గురించి అధికారికంగా తెలియ‌జేస్తాం’’ అన్నారు.
 
కోలీవుడ్ మ్యూజిక‌ల్ రాక్ స్టార్ అనిరుద్ ఇప్ప‌టికే చార్ట్‌బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్‌ను సిద్ధం చేవారు. ఓం ప్ర‌కాష్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఎన్‌.బి.శ్రీకాంత్ ఎడిటర్‌గా, మిలాన్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సుంద‌ర్ స్టంట్స్‌ను కంపోజ్ చేస్తుండ‌గా, అను వ‌ర్ధ‌న్ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. సుబ్ర‌మ‌ణియ‌న్ నారాయ‌ణ‌న్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా, జె.గిరినాథ‌న్‌, కె.జ‌య‌శీల‌న్ ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఇంకా జి.ఆనంద్ కుమార్ (స్టిల్స్‌), గోపీ ప్ర‌స‌న్న (ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌), హ‌రిహ‌ర‌సుత‌న్‌(వి.ఎఫ్‌.ఎక్స్‌), సురేష్ చంద్ర (పి.ఆర్‌.ఒ-త‌మిల్‌), నాయుడు సురేంద్ర‌కుమార్‌- ఫ‌ణి కందుకూరి (పి.ఆర్.ఒ-తెలుగు) సినిమాలో భాగ‌మై వ‌ర్క్ చేస్తున్నారు.
 
అజిత్ కుమార్  ‘విడాముయ‌ర్చి’ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్