Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయ్ - త్రిషల మధ్య సీక్రెట్ అఫైర్? కోడై కూస్తున్న కోలీవుడ్!!

vijay trisha

వరుణ్

, మంగళవారం, 25 జూన్ 2024 (14:31 IST)
కోలీవుడ్ అగ్రహీరో విజయ్, టాప్ హీరోయిన్ త్రిషల మధ్య సీక్రెట్ అఫైర్ నడుస్తున్నట్టు కోలీవుడ్ కోడై కూస్తుంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ కలిసి కనిపిస్తుండటంతో ఈ ప్రచారానికి మరింత ఊపనిస్తుంది. నిజానికి వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు నాలుగు చిత్రాల్లో నటించారు. గత యేడాది చాలా కాలం తర్వాత "లియో" చిత్రంలో నటించారు. ఇందులో త్రిష.. విజయ్ భార్యగా, ఓ తల్లికి బిడ్డగా నటించారు. అదేసమయంలో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తన చివరి చిత్రంలో కూడా త్రిషను హీరోయిన్‌గా ఎంపిక చేసుకోవాలన్న ఆలోచనలో విజయ్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇటీవల విజయ్ పుట్టిన రోజు‌కు విష్ చేస్తూ త్రిష వారిద్దరూ లిఫ్ట్‌లో ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
webdunia
 
కానీ, నెటిజన్లు మాత్రం.. త్రిష, విజయ్‌ కలిసి ఉన్న అనేక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవి విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. గతంలో  వీరిద్దరూ కలిసి పలుమార్లు విదేశాలకు వెళ్లారంటూ కొన్ని ఫోటోను పోస్ట్ చేస్తున్నారు. విజయ్ ఒంటరిగా షూస్ వేసుకుని ఉన్న ఫోటోతో పాటు ఒకటి  త్రిష ఒంటరిగా ఉన్న ఫోటోలో అదే విజయ్ షూ కనిపిస్తూ తీసిన ఫోటో ఉంది. ఈ రెంటీని కలిపి నెటిజెన్స్ రకరకాల కథనాలు అల్లేస్తున్నారు. వీరి మధ్య సీక్రెట్ ఎఫైర్ ఏమైనా నడుస్తుందనే చర్చను లేవనెత్తారు. మరోపక్క వారిద్దరు కలిసి "లియో" చిత్రీకరణ నిమిత్తం విదేశాలకు వెళ్లినప్పటి పిక్స్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
 
విజయ్ ఇదివరకే సంగీతను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం సంగీత అమెరికాలో ఉన్నారని.. కొన్ని నెలలుగా  వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారని, విడాకులు కూడా తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో విజయ్, త్రిషల మధ్య వ్యవహారం  సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంగీతతో విడాకులు.. త్రిష ప్రేమలో దళపతి విజయ్?