Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టలేని ఆనందంలో రేణూ దేశాయ్ .. ఎందుకో తెలుసా?

ఠాగూర్
ఆదివారం, 27 అక్టోబరు 2024 (10:12 IST)
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ పట్టలేని ఆనందంలో ఉన్నారు. దీనికంతటికీ కారణం మెగా ఫ్యామిలీ నుంచి ఆమెకు సాయం అందడమే. అదేసమయంలో తన కుమార్తె ఆద్య, కుమారుడు అకీరా నందన్‌లు మెగా ఫ్యామిలీ బాగా కలిసిపోవడం, తన బిడ్డలను కూడా మెగా ఫ్యామిలీకి చెందిన కుటుం సభ్యులంతా ఎంతో అల్లారముద్దుగా చూసుకుంటున్నారు. ఇది కూడా ఆమె ఆనందానికి మరో కారణంగా ఉంది. 
 
మూగ జీవాల సంరక్షణ కోసం నటి రేణూ దేశాయ్‌ గతంలో ఒక ఎన్జీవో ప్రారంభించారు. ఈ సంస్థకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన తాజాగా సాయం చేశారు. దీంతో రేణూ దేశాయ్ ఆనందం వ్యక్తం చేస్తూ, ఎన్నో ఏళ్ల తన కల నెరవేరిందని పేర్కొంటూ శనివారం పోస్ట్‌ పెట్టారు. 
 
శ్రీ ఆద్య యానిమల్‌ షెల్టర్‌ పేరుతో ఉన్న ఈ సంస్థకు ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తానొక అంబులెన్స్‌ కొనుగోలు చేసినట్లు పోస్ట్‌ పెట్టారు. దీనిని కొనుగోలు చేయడంలో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన తన వంతు సాయం చేశారు. 
 
చరణ్‌ పెంపుడు శునకం రైమీ పేరుతో విరాళం అందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రేణూ దేశాయ్‌ తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ పెట్టారు. 'అంబులెన్స్‌ కొనుగోలుకు విరాళం అందించిన రైమీకి ధన్యవాదాలు' అని రాసుకొచ్చారు. ఉపాసన కొణిదెలను ట్యాగ్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ఉపాసన మంచితనాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

నీ భార్యను నాకు ఇచ్చేయ్.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా.. భర్తను కోరిన వ్యక్తి.. చివరికి?

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments