Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరటాల చిత్రంలో రైతుగా చిరంజీవి.. అతిథి పాత్రలో చెర్రీ

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (13:33 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే యేడాది జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. అలాగే, మరో చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కే ఈ చిత్రంలో చిరంజీవి ఒక రైతుగా కనిపించనున్నారు. ఇందులో ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అతిథి పాత్రలో నటించనున్నారు. 
 
ఇప్పటికే ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసిన కొరటాల, త్వరలో చిరంజీవికి వినిపించడానికి రెడీ అవుతున్నాడట. ఈ సినిమాలో చిరంజీవి పెద్దరికానికి తగినట్టుగానే ఆయన పాత్ర ఉంటుందన్నారు. రైతు పాత్రలో చిరంజీవిని చూపిస్తూ.. సామాజిక సందేశంతో ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. జనవరిలో పూజా కార్యక్రమాలు జరుపుకునే ఈ భారీ ప్రాజెక్టు పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. 
 
ఇక ఈ సినిమాలో ఒక సందర్భంలో చరణ్ కూడా కనిపించనున్నారు. చిరూ.. చరణ్‌లతో మాట్లాడిన తర్వాతనే కొరటాల ఆ సీన్ రాసుకున్నట్టు సమాచారం. గతంలో 'మగధీర', 'బ్రూస్లీ' సినిమాల్లో చరణ్‌తో కలిసి చిరంజీవి అభిమానులకి ఆనందాన్ని కలిగించారు. ఈసారి చిరూతో కలిసి చరణ్ మెరిసి అభిమానుల ముచ్చట తీర్చనున్నాడన్న మాట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కలివి కోడిని కనుక్కునేందుకు రూ. 50 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వాలు

బంగారు పీఠం తప్పిపోయింది.. ఉన్ని కృష్ణన్ ఇంట్లో దొరికింది.. అసలేం జరుగుతోంది?

Election : అక్టోబర్ 9 నుండి 31 జిల్లాల్లో పోలింగ్- మార్గదర్శకాలు జారీ

నా మిత్రుడు పవన్ కల్యాణ్ ఎలాంటివారో తెలుసా?: సీఎం చంద్రబాబు (video)

Lady Aghori: అఘోరి కుక్కలాగ వాగితే నేను విని సైలెంట్‌గా ఉండాలా? దాన్ని కోసేస్తా: వర్షిణి స్ట్రాంగ్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments