Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీవో నుంచి మూడు కెమెరాలతో అత్యాధునిక స్మార్ట్ ఫోన్

Advertiesment
Vivo Nex Dual Screen
, బుధవారం, 12 డిశెంబరు 2018 (15:43 IST)
వీవో నుంచి అత్యాధునిక స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. వీవో నెక్స్ అనే పేరిట వీవో సంస్థ ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.44.900. రెండు ఏఎమ్ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో మూడు కెమెరాలతో ఈ ఫోన్‌ విడుదలైంది. 
 
డుయెల్ స్క్రీన్‌తో కూడిన ఫోన్‌లను విడుదల చేయడం సంస్థ లక్ష్యంగా భావించింది. ఇందులో భాగగా వీవో నెక్స్ AMOLED ప్యానల్స్‌తో.. మూడు బ్యాక్ కెమెరాలతో ఈ ఫోన్ విడుదలైంది. ఈ ఫోనులో ఫ్రంట్ కెమెరాలు వుండవు. వీటితో పాటు స్నాప్‌డ్రాగన్ 845 ఎస్ఓసీ, పది జీబీ ర్యామ్, 22.5 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లుంటాయి. 
 
ఇక వీవో నెక్స్ డుయెల్ స్క్రీన్ ఫీచర్ల సంగతికి వస్తే.. 
వీవో నెక్స్ డుయల్ స్క్రీన్ ఫన్‌టచ్ ఓఎస్ 4.5తో నడుస్తుంది. 
ఆండ్రాయిడ్ 9.0తో పనిచేస్తుంది. 
6.39 ఇంచ్‌ల ఫుల్ హెచ్డీ (1080x2340 పిక్సెల్)తో రెండు డిస్‌ప్లే ప్యానల్స్ కలిగివుంటుంది.
వివో నెక్స్ డుయెల్ స్క్రీన్ 4జీ ఎల్టీఈతో పనిచేస్తుంది. 
డుయల్ బ్యాండ్ వై-ఫై, 
బ్లూటూత్ 
జీపీఎస్, 
యూఎస్‌బీ టైప్- సీ (వీ2.0) పోర్ట్, 
3.5 ఎమ్ఎమ్ హెడ్ ఫోన్ జాక్, సెన్సార్స్ ఆన్‌బోర్డ్ స్మార్ట్‌ఫోన్‌గా పనిచేస్తుంది. 
ఇంకా వీవో నెక్స్ 199.3 గ్రాముల బరువును కలిగివుంటుందని సంస్థ వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరీ దాస్... మోడీకి ఈయనకు ఉన్న లింకేంటి?