Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్మార్ట్ ఫోన్లపై జియోమీ భారీ డిస్కౌంట్.. ఫ్లిఫ్ కార్ట్, అమేజాన్‌లలో సేల్

Advertiesment
స్మార్ట్ ఫోన్లపై జియోమీ భారీ డిస్కౌంట్.. ఫ్లిఫ్ కార్ట్, అమేజాన్‌లలో సేల్
, గురువారం, 6 డిశెంబరు 2018 (19:03 IST)
జియోమీ ఇండియా స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. జియోమీ పోకో ఎఫ్1, రెడ్‌మీ 6ఏ, ఎమ్ఐ ఏ2, రెడ్‌మీనోట్ 5 ప్రో వంటి ఫోన్లకు జియోమీ సేల్ పేరిట ఫ్లిప్ కార్ట్, అమేజాన్, ఎమ్.కామ్‌లలో సేల్ ప్రకటించింది. శనివారం నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. ఐ లవ్ ఎమ్ఐ సేవ్ పేరిట ఈ-కామర్స్ వెబ్ సైట్లలో ఈ ఫోన్లు అమ్మకానికి వుంచుతామని జియోమీ తెలిపింది.
 
రూ.19,900 ధర పలికే జియోమీ పోకో ఎఫ్1 డిస్కౌంట్ పేరిట ఐదువేల వరకు ఫ్లిఫ్ కార్ట్‌, ఎమ్ఐడాట్‌కామ్‌లో లభిస్తుంది. అన్నీ వేరియంట్లలో పోకో ఎఫ్1 లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6జీబీ రామ్, 64జీబీ స్టోరేజీ కలిగివుంటుంది. అలాగే 8జీబీ రామ్, 256జీబీ స్టోరేజ్‌తో కలిగిన పోకో ఎఫ్1 స్మార్ట్ ఫోన్ రూ.25,999 ధరకు పలుకుతోంది. ఈ ఫోన్ ఫ్లిఫ్ కార్ట్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డులపై పది శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గర్భంతో వున్నాను.. లైంగికంగా కలవకూడదని భార్య వారించినా..