Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నోకియా నుంచి 8.1 పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్..

Advertiesment
నోకియా నుంచి 8.1 పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్..
, గురువారం, 6 డిశెంబరు 2018 (16:09 IST)
నోకియా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. నోకియా 8.1 పేరిట ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ''ఆండ్రాయిడ్ 9''పై ఆపరేటింగ్ సిస్టంలో ఈ ఫోన్ పనిచేస్తుంది. 
 
ఈ నెల 10వ తేదీన భారత మార్కెట్లో ఈ ఫోన్ విడుదల అవుతుందని.. దీని ధర దాదాపు రూ.32,200గా ఉండే అవకాశం వుంది. 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3500 ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది పనిచేస్తుంది. 
 
స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఈ ఫోన్ కలిగివుంటుంది. అలాగే 6.8 ఫుల్ హెచ్డీ డిస్‌ప్లే  (1080x2244పిక్సల్)ను ఇది కలిగివుంటుందని సంస్థ వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లగడపాటి సర్వే ఉత్తుత్తిదే.. ఎవరు..?