Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో సందడి చేస్తున్న రామ్ చరణ్... అయ్యప్ప మాలను తొలగించిన చెర్రీ (video)

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (13:08 IST)
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ అమెరికాలో సందడి చేస్తున్నారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ముందు గుడ్‌ మార్నింగ్ అమెరికా టాక్ షో నిర్వహిస్తుంటారు. ఆస్కార్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక్క రామ్ చరణ్‌కు మాత్రమే ఆహ్వానం లభించింది. ఇందుకోసం ఆయన ఇటీవల న్యూయార్క్‌కు వెళ్లిన విషయం తెల్సిందే. 
 
అయితే, ఆయన అమెరికా వెళ్లే సమయంలో అయ్యప్ప మాల ధరించి వున్నారు. కానీ, శుక్రవారం ఆయన మాలను తీసివేసి.. సూటుకోటులో కనిపించారు. భారత్‌లో తాను ధరించిన అయ్యప్ప మాలను అమెరికాలో రామ్ చరణ్ తొలగించారు. 
 
అలా చేయడానికి కారణం లేకపోలేదు.. చెర్రీ అర్థ మండల దీక్షను మాత్రమే చేపట్టారు. అంటే ఈ దీక్ష 21 రోజుల పాటు మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ నెలారంభంలో ఈ దీక్షను ప్రారంభించిన చెర్రీ.. 21 రోజులు పూర్తి చేసుకోవడంతో అక్కడ ఉన్న ఒక ఆలయం వద్ద సంప్రదాయ పద్దతి ప్రకారం ఆయన మాలను తీసినట్టు సమాచారం. 
 
కాగా, గుడ్‌ మార్నింగ్ అమెరికా టాక్ షోకు టాలీవుడ్ నుంచే కాకుండా అమెరికా నుంచి ఆహ్వానం అందుకున్న తొలి సినీ సెలెబ్రిటీ చెర్రీ కావడంతో మెగా ఫ్యామిలీ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు విషెస్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూపీలో ఇద్దరు యువతుల వివాహం.. ప్రేమ.. పెళ్లి ఎలా?

శ్రీతేజ్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడు?

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న

Mariyamma Murder Case: నందిగాం సురేష్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీం

ఢిల్లీలోని భవనంపై టెర్రస్ నుంచి నవజాత శిశువు మృతదేహం.. ఎలా వచ్చింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments