'బేబమ్మ' జోరు తగ్గింది... కారణాలు ఏంటో? (video)

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (12:15 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో 'బేబమ్మ' జోరు తగ్గింది. "ఉప్పెన"లా దూసుకొచ్చిన ఈ కేరళ కుట్టీ కృతిశెట్టికి కష్టాలు చుట్టుముట్టాయి. 'ఉప్పెన' చిత్రం తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ వరుసగా పరాజయం పాలయ్యాయి. దీంతో ఆమె తన జోరును తగ్గించారు. ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం "కస్టడీ" పేరుతో తెరకెక్కుతున్న ఒకే ఒక్కచిత్రం మాత్రమే వుంది. అయితే, తనకు అవకాశాలు తగ్గిపోవడాన్ని ఆమె మరో చెబుతున్నారు. కంటెంట్ ఉన్న చిత్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నానని, అందువల్లే జోరు తగ్గిందని బుకాయిస్తున్నారు.
 
నిజానికి బేబమ్మ తొలి చిత్రం ఉప్పెన. ఈ చిత్రంతో ఈ సుందరి చూపించిన ప్రభావం అంతా ఇంతాకాదు. గ్లామర్ పరంగాను, నటన పరంగాను బంతిపువ్వులాంటి ఈ బ్యూటీ మంచి మార్కులు కొట్టేసింది. తొలి మూడు సినిమాలతో హ్యాట్రిక్ సాధించింది. ఆ తర్వాతే ఈ అమ్మడుకు అసలు కష్టాలు మొదలయ్యాయి.
 
ఈమె నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఆప్పటి నుంచి ఈమె కొత్త ప్రాజెక్టులకు కమిట్ కావడం తగ్గించారు. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న 'కస్టడీ' చిత్రంలో మాత్రమే నటిస్తున్నారు. ఈమె చేతిలో మరో చిత్రం లేదు. గతంలో మాదిరిగా కృతి గురించి ఇపుడు ఎవరూ మాట్లాడుకోవడంలేదు. 
 
సాధారణంగా వరుస ఫ్లాపులు చవిచూసినపుడు జోరు తగ్గడం సహజమే. మంచి ప్రాజెక్టు అయితేనే చేద్దాలం అనుకుని దూకుడు తగ్గించడం సహజంగానే జరుగుతుంటాయి. అయితే, ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె మంచి ప్రాజెక్టులను ఎంచుకుని ముందుకు సాగాల్సివుంటుందని ఆమె ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు. మొత్తమీద బేబమ్మ ఉద్దేశ్యపూర్వకంగా జోరు తగ్గిందా లేదా ఆమెనే దూకుడును తగ్గించిందా అనేదే ఇపుడు చర్చనీయాంశంగా మారింది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments