Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లాల్ సలాం' రిలీజ్ తేదీ వెల్లడి - మొహిద్దీన్ భాయ్‌గా రజినీకాంత్

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (14:50 IST)
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానరుపై నిర్మితమవుతున్న చిత్రం లాల్ సలామ్. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్‌గా నటిస్తున్నారు. ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్, విధార్థ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కూడా నటిస్తున్నారు.
 
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను 2024 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. తాజాగా 'జైలర్‌'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తలైవర్ ఇప్పుడు 'లాల్ సలాం'తో సంక్రాంతికి అలరించనుండటంతో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పీక్స్‌కు చేరాయి. 
 
ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ 'సూపర్ స్టార్ రజినీకాంత్గారితో మా అనుబంధం కొనసాగుతుండటం మాకెంతో ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. మా రిక్వెస్ట్ మేరకు ఆయన ఈ చిత్రంలో ఓ పవర్ఫుల్ పాత్రలో నటించారు' అని వెల్లడించారు. లాల్ సలాం చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments