ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సలార్ చిత్రం విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. డిసెంబరు 22వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా నిర్మాత డేట్ ఎనౌన్స్ చేశారు.
కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో, భారీ స్థాయిలో తెరకెక్కుతుంది. శృతి హాసన్ హీరోయిన్. హోంబలే సంస్థ నిర్మాణం. నిజానికి ఈ చిత్రం ఈ నెల 28వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్న సలార్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జాప్యం కారణంగా వాయిదా వేశారు. ఇపుడు డిసెంబరు 22వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.