Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఉస్తాద్ భగత్ సింగ్' అప్‍‌డేట్.. భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (14:31 IST)
పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో గబ్బర్ సింగ్ వచ్చింది. ఇపుడు మళ్లీ 11 యేళ్ళ తర్వాత చిత్రం రానుంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' పేరుతో తెరకెక్కుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. 
 
హైదరాబాద్ నగరంలో ఆదివారంతో ఓ భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్టు చిత్ర బృందం తెలిపింది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి వేసిన ప్రత్యేక సెట్లో యాక్షన్ సీక్వెల్స్‌ను తెరకెక్కించారు. ఇది ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అని తెలుస్తోంది. మరిన్ని వివరాలను వెల్లడిస్తామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
 
దర్శకుడు హరీష్ శంకర్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. పవర్ స్టార్ లుక్స్ పాటు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది. పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అశుతోష్ రాణా, నవాబ్ షా, 'కేజీఎఫ్' ఫేమ్ అవినాశ్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments