Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపుతున్న శ్రీలీల (video)

sree leela
, మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (10:50 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని కుర్రకారు హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. ఆమె ప్రస్తుతం టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపుతున్నారు. వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ యేడాదిలో ఎక్కువగా సందడి చేసిన శ్రీలీల ఇపుడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఆలరించనుంది. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటించనున్నారు. ఆ తర్వాత హీరోలు, రామ్, నితిన్ చిత్రాల్లో నటించనున్నారు. అలాగే, సీనియర్ హీరో బాలకృష్ణ 108వి చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఆమె తాజాగా పవన్ కళ్యాణ్‌ చిత్రం షూటింగులో పాల్గొనడానికి రంగంలోకి దిగిపోయారు. పవన్‌కు హీరోయిన్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరులో నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నగరంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుపుకుంటుంది. ఇక్కడే శ్రీలీల పాత్రకు సంబంధించిన సీన్స్‌ను కూడా ఉండటంతో ఆమె సెట్స్‌లోకి అడుగుపెట్టారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా జేబులో డబ్బులుతో సాయం చేయడంలేదు : రాఘవ లారెన్స్‌