Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న రజినీకాంత్ దర్బార్ ఫస్ట్ లుక్...

Webdunia
శనివారం, 27 జులై 2019 (20:53 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల నటించిన 2.0, పెట్టా చిత్రాల వరుస విజయాలతో మంచి జోరు మీదున్నారు. ఇక ప్రస్తుతం అయన హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందున్న లేటెస్ట్ సినిమా దర్బార్. రజినికాంత్ పోలిస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రజిని సరసన ముద్దుగుమ్మ నయనతార జోడి కడుతుండగా, మరొక హీరోయిన్ నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. 
 
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రజినీకాంత్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్లను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా దర్శకుడు మురుగదాస్ విడుదల చేయడం జరిగింది.
 
 అంతేకాదు ఈ సినిమా టైటిల్ అయిన దర్బార్‌ను ఆకట్టుకునే స్టయిల్లో డిజైన్ చేయాలని, అలా డిజైన్ చేసిన వాటిలో నుండి ఎక్కువగా ఆకట్టుకున్న ఒక టైటిల్ డిజైన్‌ను తమ సినిమా యూనిట్ ఎంపిక చేస్తుందని రజిని ఫ్యాన్స్‌ని కోరుతూ మురుగదాస్ ప్రకటించడం జరిగింది. 
 
తమిళనాట అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన లైకా ప్రొడక్షన్స్ , సుభాస్కరన్ నిర్మాతగా అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతాన్ని అందిస్తుండడం విశేషం. ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా, యోగి బాబు, తంబి రామయ్య తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments