Webdunia - Bharat's app for daily news and videos

Install App

140 మిలియన్ వ్యూస్‌తో రికార్డు సృష్టిస్తున్న ‘2.0’

Webdunia
సోమవారం, 12 నవంబరు 2018 (20:13 IST)
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘2.0’. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చెన్నైలో చాలా గ్రాండ్‌గా విడుదల చేశారు. 
 
ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయనేది ఈ ట్రైలర్‌కి వచ్చిన వ్యూస్ చూస్తే అర్థమవుతుంది. కేవలం పది రోజుల్లోనే 140 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డు సృష్టించింది ‘2.0’. 14 కోట్ల మంది ఈ ట్రైలర్‌ను వీక్షించారంటే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 
 
 
సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ విలన్ పాత్ర పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, ఎడిటింగ్: ఆంటోని, నిర్మాత: సుభాష్ కరణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments