Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాహుబలిని బ్రేక్ చేసిన అరవింద సమేత వీర రాఘవ..

Advertiesment
NTR
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ''అరవింద సమేత వీర రాఘవ'' చిత్రం బాహుబలి రికార్డును బ్రేక్ చేసిందని టాక్ వస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. రాయలసీమ యాసలో, ఫ్యాక్షనిజం నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోను ఈ చిత్రం వసూళ్లు దుమ్మురేపేస్తోంది.
 
తాజాగా తెలంగాణలో అరవింత సమేత చిత్రం తొలిరోజునే బాహుబలి సినిమాకంటే అధిక వసూళ్ల వచ్చాయి. అంటే నైజామ్‌లో ఈ చిత్రం రూ.5.73 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో మెుదటి రోజుకే రూ. 26.64 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.60 కోట్లు షేర్స్ వచ్చాయి. 
 
అసలు విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ యాక్షన్.. పూజా గ్లామర్ ఈ చిత్రానికి భారీ వసూళ్లు రావడానికి కారణమని సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఈ సినిమా పాటలు, స్క్రిప్ట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన, పూజా హెగ్డే రాయల యాస ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇవే సినిమాకు భారీ వసూళ్లను సంపాదించిపెడుతున్నాయని సినీ పండితులు, ఫ్యాన్స్ చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిక్కీమౌస్ అ, స్పోర్ట్స్ బ్రా వేసుకున్నా.. వాటిని కూడా తొలగించమన్నారు..