ట్రిపుల్ ఆర్.. గూగుల్ సెర్చ్‌ ట్రెండింగ్‌లో ఒలీవియా పేరు..

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (15:29 IST)
బాహుబలి సినిమాకు తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్, చెర్రీ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సరసన జెన్నీఫర్ పాత్రలో 'ఒలీవియా మోరిస్', బ్రిటీష్ స్కాట్ పాత్రలో రే స్టీవెన్‌సన్, లేడీ స్కాట్‌గా అలీసన్ డూడీ నటిస్తున్నట్టు సినీ యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెర్చింజన్ గూగుల్‌లో దేశవ్యాప్తంగా ఎంతోమంది నెటిజెన్స్ వీరి గురించి వెతకడం మొదలుపెట్టారు. 
 
గతంలో వీరు చేసిన సినిమాలు.. వీరికున్న పాపులారిటీ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఒలీవియా మోరిస్ పేరు ఇండియాలో ఎక్కువసార్లు ట్రెండ్ అయింది. బుధవారం ఒక్కరోజే దాదాపు రెండు లక్షల సార్లు ఆమె పేరును గూగుల్‌లో సెర్చ్ చేశారు. 
 
ఇదే విషయాన్ని ట్రిపుల్ ఆర్ చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రేక్షకులు సినిమా పట్ల ఇంత క్యురియాసిటీతో ఉండటంపై హర్షం వ్యక్తం చేసింది. మొత్తం మీద హాలీవుడ్ క్యాస్టింగ్‌తో ట్రిపుల్ ఆర్‌కు కావలసిన పబ్లిసిటీ తీసుకొస్తున్నాడు జక్కన్న. తప్పకుండా ట్రిపుల్ ఆర్ సినిమాతో అంతర్జాతీయ సినీ ప్రపంచానికి తన దర్శకత్వ నైపుణ్యాన్ని తెలియజేస్తాడని సినీ పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments