Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో రాజమౌళి సినిమా?

దర్శకధీరుడు, బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమాపై రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకు రాజమౌళి ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలను ఎంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి కొత్త

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (09:12 IST)
దర్శకధీరుడు, బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమాపై రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకు రాజమౌళి ఇద్దరు టాలీవుడ్ టాప్  హీరోలను ఎంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి కొత్త సినిమా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 
 
అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన రాకపోయినా.. వీరిద్దరు హీరోలనూ చెరోపక్కన కూర్చోబెట్టుకుని రాజమౌళి దిగిన ఫోటోను ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో పంచుకోవడంతో ఈ కాంబినేషన్‌లో కొత్త సినిమా రానుందని టాక్ వస్తోంది. 
 
బాక్సాఫీసు బద్దలయ్యే కాంబినేషన్ ఇదని ఫ్యాన్స్ అంటున్నారు.  ఈ ఫోటోను చూసి నెటిజన్లు రాజమౌళి ఇద్దరినీ కూర్చోబెట్టి కథను వినిపించారని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటుండగా.. ఇవన్నీ మీ ఊహకే వదిలేస్తున్నా అన్నట్లు ఈ ఫొటోకు రాజమౌళి క్యాప్షన్ పెట్టారు.
 
ఇక ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నంబర్ వన్, సింహాద్రి, యమదొంగ చిత్రాలను, రామ్ చరణ్ హీరోగా మగధీర చిత్రాన్ని రాజమౌళి అందిస్తే ఆ చిత్రాలన్నీ బ బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 
 
ఇక బాహుబలి రెండు చిత్రాల తరువాత రాజమౌళి చేయబోయే సినిమాపై జాతీయ స్థాయిలో ఆసక్తి పెరుగుతున్న వేళ, ఆయన మల్టీ స్టారర్ స్టోరీతో రానున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటో ద్వారా ఆ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. జూన్ నుంచి ఈ కాంబోలో సినిమా సెట్స్ పైకి రానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments