Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ ఎన్ని భాష‌ల్లో రిలీజ్ అవుతుందో తెలుసా..?

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (23:02 IST)
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందుతోన్న ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ఇప్ప‌టివ‌ర‌కు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. డి.వి.వి ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పైన దాన‌య్య ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్ చ‌రిత్ర ఆధారంగా రాజ‌మౌళి ఈ సినిమాని తెర‌కెక్కిస్తుండ‌డంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాని తెరపై చూస్తామా అనే ఆస‌క్తి ఏర్ప‌డింది.
 
ఈ నెలాఖ‌రు నుంచి అహ్మాదాబాద్, పూణెలో 30 రోజుల షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్‌కు జోడిగా అలియా భట్, ఎన్టీఆర్‌కు జోడీగా డైసీ నటిస్తున్నారు. హీరోయిన్స్ ఇద్ద‌రు ఈ షెడ్యూల్లో జాయిన్ అవుతార‌ని స‌మాచారం. దాదాపు  400 కోట్ల బ‌డ్జెట్‌తో హై టెక్నీక‌ల్ వేల్యూస్‌తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ సినిమాని దాన‌య్య నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ‌గ‌న్, త‌మిళ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.
 
తెలుగు, హిందీ, మ‌ల‌యాళం, త‌మిళ్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇవే కాకుండా వేరే భాష‌ల నుంచి కూడా డిమాండ్స్ వ‌స్తుండ‌డంతో 10 ఇండియ‌న్ లాంగ్వేజ‌స్‌లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సంచ‌ల‌న చిత్రాన్ని 2020 జులై 30న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విషం తాగింది.. ఆపై ఆస్పత్రి భవనం నుంచి దూకేసింది.. ఏమైందంటే?

తెలంగాణలో రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన- కోటి దీపోత్సవానికి హాజరు

యాంటీబయాటిక్స్‌ విషయంలో ఈ పొరపాట్లు చేయొద్దు

సజ్జల భార్గవ్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయాలి: వైఎస్ షర్మిల

కొత్త మెనూని పరిచయం చేసిన హైదరాబాద్ బౌగెన్‌విల్లా రెస్టారెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments