Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా నుంచి 40మంది ఫైటర్లను తెప్పించిన రాజ‌మౌళి

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (16:20 IST)
RRR poster
ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఏది చేసినా గ్రాండ్‌గా వుంటుంది. తీసిందే తీసి రోజుల త‌ర‌బ‌డి తీస్తాడ‌నే పేరున్నా, ఔట్‌పుట్ మాత్రం అదుర్స్‌గా వుంటుంద‌నేది నిర్మాత‌ల ఉవాచ‌. ఇప్పుడు తాజాగా రియ‌లిస్టిక్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను ఆర్‌.ఆర్‌.ఆర్‌.లో చొప్పించ‌డానికి ఏకంగా అమెరికా నుంచి దాదాపు 40 మంది పైట‌ర్ల తెచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే వారంతా హైదరాబాద్కి చేరుకున్నారు. వారికి స్టార్ హోట‌ల్‌లో బ‌స ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్‌లోని ఓ హోట‌ల్‌లో అనుకున్నా, ఫిలింసిటీలోనే ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం.

ఇక రాజమౌళి `ఆర్ఆర్ఆర్` సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. క్లైమాక్స్ సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. `గ్లాడియేటర్`, `బోర్న్ ఐడెంటిటీ`, `ఎక్స్ మెన్` వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ పర్యవేక్షణలో ఈ క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రామ్‌చరణ్, ఎన్టీయార్ ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. నిక్ పావెల్ పర్యవేక్షణలో ఎన్టీయార్, రామ్‌చరణ్‌తో వీరు తలపడబోతున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ అత్యంత భారీగా, ఇంతకుముందు ఎవ్వ‌రూ చూపించ‌నంత‌గా అద్భుతంగా ఉండబోతోందట. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీయార్ నటిస్తున్న ఈ చిత్రంలో ఆలియా భట్, ఓలియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

Miss World: అందాల పోటీలు మహిళలను వేలం వేయడం లాంటిది.. సీపీఐ నారాయణ ఫైర్

మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్న పాక్ మహిళల్ని ఏం చేశారు?

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments