Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘ఆకాశ‌వాణి’ టీజ‌ర్ ఆవిష్క‌రించిన రాజ‌మౌళి

Advertiesment
‘ఆకాశ‌వాణి’ టీజ‌ర్ ఆవిష్క‌రించిన రాజ‌మౌళి
, శుక్రవారం, 5 మార్చి 2021 (17:32 IST)
Akashvani poster
విల‌క్ష‌ణ న‌టుడు సముద్ర‌ఖని‌, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్ కీల‌క పాత్ర‌ధారులుగా ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ప‌ద్మ‌నాభ‌రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘ఆకాశ‌వాణి’. రాజ‌మౌళి వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన అశ్విన్ గంగ‌రాజు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. శుక్ర‌వారం ఈ సినిమా టీజ‌ర్‌ను ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి విడుద‌ల చేసి సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.
 
టీజ‌ర్‌లో ఇలా వుంది!
‘‘అడ‌వికి చాలా ద‌గ్గ‌ర‌గా ఉండే ఓ చిన్న గ్రామం అంద‌రూ అమాయ‌కులైన ప్ర‌జ‌లు.. సంతోషంగా గంతులు వేస్తున్న పిల్ల‌లు, ఓ అడ‌వి మ‌నిషిని చూసి చిన్న‌పిల్ల‌వాడు భ‌య‌ప‌డ‌టం, ఆ గ్రామంలో మ‌నుషులు దేన్నో చూసి భ‌య‌ప‌డుతూ టెన్ష‌న్‌గా ఉండ‌టం, రాత్రివేళ‌ల్లో గ్రామ‌స్థులంతా దేనికోస‌మే చేసే అన్వేష‌ణ..’’ ఇలాంటి స‌న్నివేశాల క‌ల‌యిక‌గా  టీజ‌ర్ క‌నిపిస్తుంది. టీజర్‌లో రెండు స‌న్నివేశాల్లో సముద్రఖని కనిపిస్తున్నాడు. చివరలో ఇక్క‌డేదో త‌ప్పు జ‌రుగుతుంది శీను అని స‌ముద్ర‌ఖ‌ని త‌న ప‌క్క‌నున్న వ్య‌క్తితో చెప్ప‌డంతో టీజ‌ర్ ముగిసింది. 
 
‘ఆకాశ‌వాణి’ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి త‌న‌యుడు, సింగ‌ర్ కాల‌భైర‌వ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందిస్తుండ‌గా, సురేశ్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఈ చిత్రానికి ఎడిట‌ర్‌. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీగా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హార‌ర్ సినిమాలో విల‌న్‌గా వ‌ర‌ల‌క్ష్మి ‌