Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హార‌ర్ సినిమాలో విల‌న్‌గా వ‌ర‌ల‌క్ష్మి ‌

Advertiesment
హార‌ర్ సినిమాలో విల‌న్‌గా వ‌ర‌ల‌క్ష్మి ‌
, శుక్రవారం, 5 మార్చి 2021 (17:25 IST)
Varalakshmi
ఇటీవ‌ల 'క్రాక్'‌, 'నాంది' సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న న‌ట‌న‌తో అమితంగా ఆక‌ట్టుకున్న విల‌క్ష‌ణ తార వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్. నాయిక‌గా హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కాంచ‌న కోనేరు ఓ చిత్రాన్ని నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. కోనేరు స‌త్యనారాయ‌ణ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రానికి డార్లింగ్ స్వామి ద‌ర్శ‌కుడు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ బ‌ర్త్‌డేని పుర‌స్క‌రించుకొని ఈ చిత్రాన్ని ఈరోజు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఓ పోస్ట్‌ర్‌ను రిలీజ్ చేశారు. హార‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందే ఈ సినిమాలో వర‌ల‌క్ష్మి ఓ విల‌క్ష‌ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ముర‌ళీకృష్ణ కొడాలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించే ఈ చిత్రానికి గాంధీ న‌డికుడిక‌ర్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా, అమ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ చిత్రంలో లేడీ పొలిటీషియన్‌గా వరలక్ష్మి!