Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడ్ని `బ్యాక్ డోర్‌` నుంచి ర‌మ్మ‌న్న పూర్ణ‌!

Advertiesment
ప్రియుడ్ని `బ్యాక్ డోర్‌` నుంచి ర‌మ్మ‌న్న పూర్ణ‌!
, మంగళవారం, 2 మార్చి 2021 (16:55 IST)
Back door movie
త‌న ప్రియుడ్ని న‌టి పూర్ణ బేక్‌డోర్ నుంచి ఆహ్వానిస్తుంది. అత‌ను రాగానే మొద‌టిసారైనా ఏదో తెలియ‌ని అనుభూతి అంటుంది. అత‌ను పూర్ణ‌ను మ‌రింత ద‌గ్గ‌ర‌గా తీసుకుంటూ `న‌న్ను ఎందుకు పిలిచావ్‌. ఏం చెప్ప‌బోతున్నావ్‌.. ఆశ ‌పెట్టి తీర్చ‌క‌పోతే చాలా పాపం తెలుసా! అంటూ బ‌దులిస్తాడు. ఇలా ఆస‌క్తిగా సాగే టీజ‌ర్ పూర్ణ న‌టించిన బ్యాక్‌డోర్ సినిమాలోనిది. టీజ‌ర్‌ను హైద‌రాబాద్‌లో ప్రముఖ నిర్మాతలు కె.ఎస్.రామారావు, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, రాజ్ కందుకూరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆవిష్క‌రించారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన "బ్యాక్ డోర్" టీజర్ చాలా బాగుందని, దర్శకుడు బాలాజీ ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపించిందని, ఇప్పటికే నంది అవార్డు గెలుచుకున్న బాలాజీ 'బ్యాక్ డోర్'తో మరిన్ని అవార్డులు గెలుచుకోవాలననీ, పూర్ణ కెరీర్ లో మరో మంచి హిట్ ఫిల్మ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అతిధులు ఆకాంక్షించారు.

తనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి, రష్ చూసి ఇంప్రెస్ అయి చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్న చిత్ర సమర్పకులు సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ లతోపాటు సినిమా అద్భుతంగా వచ్చేందుకు సహకరించిన హీరోయిన్ పూర్ణ, హీరో తేజలకు చిత్ర ద‌ర్శ‌కుడు కర్రి బాలాజీ కృతజ్ఞతలు తెలిపారు.
    తన కెరీర్ లో ఓ మైల్ స్టోన్ ఫిల్మ్ గా "బ్యాక్ డోర్" నిలిచిపోతుందని, దర్శకుడు బాలాజీ ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా తెరకెక్కించారని హీరోయిన్ పూర్ణ అన్నారు. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు, నటనలో తనకు ఎన్నో సూచనలిచ్చిన పూర్ణకు చిత్ర కథానాయకుడు తేజ కృతజ్ఞతలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాంబే నుంచి సిమ్లాకు బదిలీ చేయండి.. : సుప్రీంలో కంగనా పిటిషన్