Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 27 April 2025
webdunia

ఏప్రిల్ 23న ''తలైవి''గా వస్తోన్న జయలలిత

Advertiesment
Thalaivi
, బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (23:34 IST)
Thalaivi
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవిగా రూపుదిద్దుకుంటోంది. ఫిబ్రవరి 24న ఆమె పుట్టిన రోజు సందర్భంగా.. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'తలైవి' విడుదల తేదీ ఖరారైంది.

ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ బయోపిక్‌లో తలైవిగా బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ కనిపించనుంది. ఇక ఈ చిత్రంలో ఎంజీఆర్‌గా అరవింద్‌స్వామి కనిపించనున్నారు. కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌, శశికళ పాత్రలో పూర్ణ నటించారు.
 
ఫిబ్రవరి 24న జయలలిత జయంతి సందర్భంగా చిత్రబృందం విడుదల తేదీని ఖరారు చేసింది. ఏప్రిల్‌ 23న తలైవి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వాస్తవానికి గతేడాది జూన్‌ 26న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తికాకపోవడంతో విడుదల జాప్యమైన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీదేవి వర్ధంతి.. కుమార్తెల భావోద్వేగం.. సినీ సామ్రాజ్యపు పట్టపు రాణి ఇక వస్తుందా?