Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్ఆర్ఆర్ సినిమాకు తప్పని లీకులు.. తలపట్టుకున్న జక్కన్న!

Advertiesment
LEAKED photos
, గురువారం, 4 మార్చి 2021 (09:50 IST)
టాలీవుడ్‌ స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పిన ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాకు లీకుల బెడద తప్పట్లేదు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక ఫొటోలు లీక్‌ అయ్యాయి. అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్న రామ్‌ చరణ్‌ పిక్‌, కొమురం భీమ్‌ పాత్ర చేస్తోన్న ఎన్టీఆర్‌ పిక్‌తో పాటు మరికొన్ని ఫొటోలు కూడా లీక్‌ అయ్యాయి. 
 
మరీ ముఖ్యంగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి ఈ చిత్రంలో పులితో ఫైట్‌ ఉంటుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఫైట్‌కి సంబంధించిన కీలకమైన ఫొటో కూడా లీక్‌ కావడం ఇప్పుడు చిత్రయూనిట్‌ని కలవరపెడుతోంది.
 
భీమ్‌ ఇంట్రో టీజర్‌లో తలపై రక్తం పోసుకునే సన్నివేశాన్ని చూపించారు. పులిని రప్పించడం కోసం ఎన్టీఆర్‌ అలా రక్తం మీద పోసుకుంటాడని, ఆ తర్వాత పులి వచ్చాక దానిని మట్టుపెడతాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా లీకైన స్టిల్‌ ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేస్తుంది. 
 
ఏదీఏమైనా.. ఈ లీక్స్‌పై చిత్ర దర్శకనిర్మాతలు దృష్టిపెట్టకపోతే.. సినిమాకు మరింత డ్యామేజ్‌ అయ్యే అవకాశం లేకపోలేదు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ కి సంబంధించిన ఈ లీక్స్‌పై చిత్ర దర్శకనిర్మాతలు సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. అయితే లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రశేఖర్ యేలేటి పుట్టినరోజు.. ఓ కొత్తదారిలో ఆయన ''ప్రయాణం''