Webdunia - Bharat's app for daily news and videos

Install App

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

దేవీ
సోమవారం, 17 మార్చి 2025 (17:21 IST)
Raj Tarun
ఇటీవల పలు వివాదాలకు గురయిన రాజ్ తరుణ్, ఏం బతుకురా నాది అంటూ ఓ గీతంలో నటించారు. ఇది పాంచ్ మినార్’  అనే సినిమాలోనిది.  మిడిల్ క్లాస్ ఆంథమ్ గా 'ఏం బతుకురా నాది' సాంగ్ హీరో క్యారెక్టర్ ని ప్రజెంట్ చేస్తూ అనంత్ శ్రీరామ్ రాసిన లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సాంగ్ లో రాజ్ తరుణ్ డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. అందరినీ కనెక్ట్ అయిన ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.
 
రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్  ‘పాంచ్ మినార్’. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
ఈ రోజు మేకర్స్ సినిమా ఫస్ట్ సింగిల్ మిడిల్ క్లాస్ ఆంథమ్ 'ఏం బతుకురా నాది' సాంగ్ రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర ఈ సాంగ్ ని క్యాచి ట్యూన్ గా కంపోజ్ చేశారు. దినేష్ రుద్ర ఈ పాటని పాడిన స్టయిల్ ఎట్రాక్టివ్ గా వుంది.
ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిత్య జవ్వాది డీవోపీ కాగా ప్రవీణ్ పూడి ఎడిటర్. ‘బేబీ’ సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్.
 
నటీనటులు: రాజ్ తరుణ్, రాశి సింగ్,అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ, సుదర్శన్, కృష్ణ తేజ, నంద గోపాల్, ఎడ్విన్ లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Akbaruddin Owaisi: అసెంబ్లీ గాంధీ భవన్ మారింది... అక్భరుద్ధీన్ ఫైర్ అండ్ వాకౌట్

ఉపాధి కోసం పలు భాషలు నేర్చుకోవాలి.. రాజకీయాలు వద్దు : సీఎం చంద్రబాబు

నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం.. ప్రారంభించిన తెలంగాణ సర్కారు

ఉపాధి హామీ పనుల్లో రూ.250 కోట్ల అవినీతి : డిప్యూటీ సీఎం పవన్

ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు.. రైలు కిందపడి యువ జంట ఆత్మహత్య? ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments