Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘు కుంచెకు కోపం వచ్చింది

Webdunia
గురువారం, 2 జులై 2020 (15:27 IST)
యాంకర్‌గా, నటుడిగా, సింగర్‌గా, సంగీత దర్శకుడిగా... ఇలా తను ప్రవేశించిన ప్రతి శాఖలో ప్రేక్షకులను మెప్పించాడు రఘు కుంచె. ఇటీవల పలాస 1978 సినిమాలో ప్రతినాయకుడు పాత్రలో నటించి మరోసారి మెప్పించాడు. తాజాగా 47 డేస్ సినిమాని నిర్మించాడు. ఈ సినిమా ద్వారా పూరి శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
 
ఈ సినిమాని థియేటర్లోనే రిలీజ్ చేయాలని నిర్మించినప్పటికీ... ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ చేసే పరిస్థితి లేకపోవడంతో ఓటీటీ ద్వారా 47 డేస్ మూవీని రిలీజ్ చేసారు. అయితే.. ఈ సినిమాకి సినీ విమర్శకుల నుంచి విమర్శలు రావడం.. రివ్యూ రేటింగ్‌లో తక్కువ రేటింగ్ ఇవ్వడంతో రఘు కుంచెకు కోపం వచ్చింది.
 
అంతే... ట్విట్టర్లో తన బాధను తనదైన శైలిలో వ్యక్తం చేసాడు. ఇంతకీ... రఘు ఏమన్నాడంటే... రూపాయి పెట్టి సినిమా తీసిన నిర్మాత ఆ రూపాయి వస్తాదో రాదో అని బేల ముఖo వేసుకుని చూస్తుంటే, ఆ రూపాయి సినిమాని, నువ్ Netflixలో రాత్రి చూసిన 10 రూపాయిల సినిమాతో పోల్చుకుని... ఈ రూపాయి సినిమాని నీ వేళ్ళతో పొడిచేస్తున్నావ్, చూడన్నా... అదన్నా ... నీ మేధస్సు.
 
ఎక్కువ చేస్తున్నాడు అని అనుకుంటున్నావు కాదన్నా... అవునన్నా... నిన్న నా స్థానంలో నువ్వుంటే, నా కడుపు మంట నీకు బాగా అర్థం అయ్యేది అన్నా. పర్లేదు అన్నా Futureలో నువ్ ఎలాగూ torture పెడతావ్... దానికి సిద్ధపడే ఉన్నా అన్నా అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసాడు.

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments