Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్యాన్స్‌కి కోపం, బ్యాన్ యు.వి. క్రియేషన్స్ అంటూ పోస్టులు, ప్రభాస్ రియాక్షన్ ఏంటి..?

Advertiesment
ఫ్యాన్స్‌కి కోపం, బ్యాన్ యు.వి. క్రియేషన్స్ అంటూ పోస్టులు, ప్రభాస్ రియాక్షన్ ఏంటి..?
, శనివారం, 11 ఏప్రియల్ 2020 (20:46 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా విదేశాల్లో షూటింగ్ జరుపుకుంది.

ప్రభాస్ మరికొంత మంది ఫైటర్స్ పైన చిత్రీకరించిన యాక్షన్ సీన్స్ హైలెట్‌గా నిలుస్తాయని డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెలియచేసారు. ఈ భారీ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పిరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాని అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిస్తున్నారు.
 
ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కి కోపం వచ్చింది. నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బ్యాన్ యు.వి. క్రియేషన్స్ అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా... కరోనా వలన షూటింగ్స్ ఆగిపోయినా... ఆర్ఆర్ఆర్ టీమ్ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా వీడియో రిలీజ్ చేయడం.. ఆ వీడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ రావడం తెలిసిందే. రాజమౌళినే వీడియో రిలీజ్ చేసారు. మీరెందుకు రిలీజ్ చేయలేదు అని ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
 
ఉగాదికి ప్రభాస్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ వస్తుందని ఫ్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తే.. వాళ్లకి నిరాశే ఎదురైంది. దీంతో ఈవిధంగా తమ కోపాన్ని తెలియచేస్తున్నారు. మరి.. ప్రభాస్ రియాక్షన్ ఏంటి..? ఫ్యాన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రభాస్ వాళ్లని ఎలా కూల్ చేస్తాడు..? అనేది ఆసక్తిగా మారింది. అయితే... నిర్మాతలకు ప్రభాస్ టైటిల్‌ని ఫిక్స్ చేసి ఎనౌన్స్ చేయమని చెప్పారని టాక్ వినిపిస్తోంది. మరి.. ఫ్యాన్స్ కోసం టైటిల్‌ని ఫస్ట్ లుక్‌ని త్వరలోనే రిలీజ్ చేస్తారేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లస్ట్ స్టోరీస్ రీమేక్‌లో ఈషా రెబ్బా.. గ్లామర్ పంట పండిస్తుందా?