Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయ్‌పూర్‌లో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా వివాహం

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (11:07 IST)
ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోబోతున్నారు. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో లీలా ప్యాలెస్, ది ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో వీరి వివాహ వేడుకలు జరుగనున్నాయి. 
 
200మందికి పైగా అతిథులు వీరి పెళ్లికి హాజరు కానున్నారు. వీరికోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే 50మందికి పైగా వీవీఐపీలు వివాహానికి హాజరవుతున్నట్లు సమాచారం. బుకింగ్‌లు ఖరారైన వెంటే రెండు హోటళ్లలో వివాహ వేడుకలకు సన్నాహాలు ప్రారంభించారు. 
 
ఈ వివాహానికి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా పలువురు హాజరుకానున్నారు. పరిణీతి చోప్రా కజిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ కూడా ఈ వేడుకకు విచ్చేయనున్నారు. 
 
హల్దీ, మెహందీ, మహిళల సంగీత్‌తో సహా వివాహ కార్యక్రమాలు సెప్టెంబర్ 23న ప్రారంభం కానున్నాయి. పెళ్లి తర్వాత, హర్యానాలోని గురుగ్రామ్‌లో గ్రాండ్ రిసెప్షన్ ప్రారంభం అవుతాయి. మే 13న ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments