Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక్కో సీజన్‌కు ఒక్కో భాగస్వామిని మార్చడమే సహజీవనం : అలహాబాద్ హైకోర్టు

living relationship
, ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (15:06 IST)
దేశంలో జరుగుతున్న సహజీవనాలపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆందోళన వ్యక్తంచేసింది. సహజీవనాలు మన దేశంలోని అత్యంత బలమైన, సంప్రదాయబద్ధమైన వివాహ వ్యవస్థను నాశనం చేస్తున్నాయని వ్యాఖ్యానించింది. వివాహాలు ఇచ్చే భద్రత, సమాజ అమోదం, స్థిరమైన బంధాన్ని సహజీవనాలు (లివిన్ రిలేషన్ షిప్స్) ఇవ్వలేవని తెలిపింది. ఒక్కో సీజన్‌కు ఒక్కో భాగస్వామిని మార్చే ఈ దరిద్రపు వ్యవస్థ ఆరోగ్యకరమైన సమాజానికి ఏమాత్రం మంచిది కాదని చెప్పింది.
 
సహజీవనం అనేది అభివృద్ధి చెందిన సొసైటీలో భాగమని భావిస్తున్నారని హైకోర్టు విమర్శించింది. ఇలాంటి భావనకు యువత ఆకర్షితులవుతున్నారని, లివిన్ రిలేషన్ షిప్‌ల వల్ల జరిగే అనర్థాలపై వారికి అవగాహన లేదని ఆవేదన వ్యక్తం చేసింది. లివిన్ రిలేషన్ షిప్‌ల వల్ల అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాయని... వివాహ వ్యవస్థను కాపాడుకోవడం వారికి పెద్ద సమస్యగా మారిందని తెలిపింది.
 
అద్నాన్ అనే ఒక వ్యక్తికి బెయిల్ ఇస్తున్న సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తనను మోసం చేశాడంటూ ఉత్తరప్రదేశ్ షహరాన్ పూర్‌కు చెందిన 19 ఏళ్ల యువతి అతనిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గత ఏప్రిల్ నెలలో అద్నాన్‌ను అరెస్టు చేశారు. ఏడాది కాలంగా తాము సహజీవనం చేస్తున్నామని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. 
 
తాను గర్భం దాల్చిన తర్వాత తనను పెళ్లి చేసుకోడానికి అద్నాన్ నిరాకరించాడని తెలిపింది. తప్పుడు ప్రమాణాలు చేసి తనతో శృంగారంలో పాల్గొన్నాడని చెప్పింది. ఈ కేసులో అద్నాన్‌కు బెయిల్ మంజూరు చేస్తున్న సందర్భంగా హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ : కోవింద్ కమిటీలోని సభ్యుల పేర్లు వెల్లడి