హిందూ వారసత్వ చట్టం కింద హిందూ అవిభాజ్య కుటుంబపు పూర్వీకుల ఆస్తిలో అక్రమ సంబంధాలతో పుట్టిన బిడ్డలకూ వాటా ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది. అక్రమ సంతానానికి ఈ హక్కు ఉండదంటూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రస్తుత ధర్మాసనం విభేదించింది.
శుక్రవారం ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న ఓ అభ్యర్థనపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. ఈ విచారణలో భాగంగా అక్రమ సంబంధం కారణంగా పుట్టిన సంతానానికి కూడా ఆస్తిలో వాటా వుందని పేర్కొంది.