Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ : కోవింద్ కమిటీలోని సభ్యుల పేర్లు వెల్లడి

ramnath kovind
, ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (14:26 IST)
దేశంలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలతో కలిసి మరో 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మినీ జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఒక కార్యాచరణను రూపొందించేందుకు వీలుగా కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 
 
ఈ కమిటీలో సభ్యులను కేంద్రం తాజాగా నియమించింది. మొత్తం ఎనిమిది సభ్యులతో ఈ కమిటీకి రూపకల్పన చేసింది. ఈ కమిటీకి ఛైర్మన్‌నాథ్ కోవింద్ వ్యవహరిస్తారు. అమిత్ షా, అధిర్ రంజన్, గులాంనబీ ఆజాద్, ఎన్‌కే సింగ్, హరీశ్ సాల్వే, సుభాష్, సంజయ్ కొఠారీ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
 
ఒకే దేశం - ఒకే ఎన్నిక సాధ్యాసాధ్యాలు, విధి విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. కాగా, సెప్టెంబరు 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన కేంద్రం... ఈ సమావేశాల్లోనే ఒకే దేశం - ఒకే ఎన్నికపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సజావుగా సాగుతున్న ఆదిత్ ఎల్-1 ప్రయోణం.. రెండో కక్ష్యం పెంపు