Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సజావుగా సాగుతున్న ఆదిత్ ఎల్-1 ప్రయోణం.. రెండో కక్ష్యం పెంపు

Advertiesment
aditya L1
, ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (13:51 IST)
దేశ తొలి సౌర అధ్యయన ఉపగ్రహం ఆదిత్య-ఎల్1 నిర్ధేశిత భూకక్ష్యలోకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఆదివారం తొలి భూకక్ష్యం పెంపు విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టినట్టు పేర్కొంది. బెంగుళూరులో ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ఐఎస్టీఆర్ఏసీ) నుంచి ఈ ప్రక్రియను పూర్తి చేసినట్టు తెలిపింది. దీంతో ఆదిత్య-ఎల్1 ఇపుడు 245,22,459 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి ప్రవేశించింది. మిషన్ అంతా సజావుగా సాగుతోందని, రెండో భూకక్ష్య పెంపు నిర్వహించనున్నట్టు తెలిపింది. 
 
'ఆదిత్య-ఎల్ 1' ఉపగ్రహంతో పీఎస్ఎల్వీ-సి57 వాహకనౌక శనివారం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 63 నిమిషాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం 1480.7 కిలోల ఉపగ్రహాన్ని భూ కక్ష్యలో ప్రవేశపెట్టింది. 16 రోజుల పాటు భూ కక్ష్యల్లోనే చక్కర్లు కొట్టనున్న 'ఆదిత్య-ఎల్1'.. అనంతరం భూమికి 15 లక్షల కి.మీ. దూరంలో ఉన్న నిర్దేశిత ఎల్ బిందువు దిశగా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని ఇస్రో తెలిపింది. ఇందులో 7 పరిశోధన పరికరాలున్నాయని పేర్కొంది. ఇవి సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయని, సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయని తెలిపింది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనియా గాంధీకి అస్వస్థత - గంగారాం ఆస్పత్రిలో చికిత్స