Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ "రాధేశ్యామ్‌"కు ముగ్గురు సంగీత దర్శకులు...

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (14:41 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. పూజా హెగ్డే కథానాయిక. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పని చేయనున్నారు. 
 
సాధారణంగా ఒక చిత్రాన్ని పలు భాషల్లో నిర్మించినప్పటికీ ఒకే సంగీత దర్శకుడు పనిచేయడం ఆనవాయితీ. కానీ, ఇందుకు భిన్నంగా 'రాధే శ్యామ్' సినిమాకి మాత్రం మొత్తం ముగ్గురు సంగీత దర్శకులు పనిచేస్తుండడం ఓ విశేషంగా చెప్పుకోవాలి.
 
ఈ సినిమా దక్షిణాది వెర్షన్లకు అంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లకు జస్టిన్ ప్రభాకరన్ పాటలను చేస్తుండగా.. హిందీ వెర్షన్‌కి మాత్రం ఇద్దరు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. అక్కడ రెండు పాటలకు మిథున్.. మరో పాటకు మన్నన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. నిజంగా ఇదొక విశేషమనే చెప్పాలి.
 
మరోవైపు, ఇక ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈ నెల 14న వేలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన అప్ డేట్‌ను శుక్రవారం చిత్ర బృందం ఇచ్చింది. 14వ తేదీ ఉదయం 9.18 నిమిషాలకు టీజర్‌ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
 
ప్రభాస్, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జులై 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న నారా చంద్రబాబు నాయుడు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments