Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండతో రాశి ఖన్నా... కుర్రకారుకు పండగేనంటున్న ఫిల్మ్ నగర్

'అర్జున్ రెడ్డి' చిత్రంతో మంచి గుర్తింపు పొందిన హీరో విజయ్ దేవరకొండ. ఆగస్టు 15వ తేదీన "గీత గోవిందం" చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకురానున్నారు. అయితే, విజయ్ దేవరకొండతో స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా జతకట్

Webdunia
మంగళవారం, 14 ఆగస్టు 2018 (11:53 IST)
'అర్జున్ రెడ్డి' చిత్రంతో మంచి గుర్తింపు పొందిన హీరో విజయ్ దేవరకొండ. ఆగస్టు 15వ తేదీన "గీత గోవిందం" చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకురానున్నారు. అయితే, విజయ్ దేవరకొండతో స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా జతకట్టనుంది. 
 
'మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు', 'ఓన‌మాలు' ఫేం క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కే చిత్రంలో రాశి ఖన్నాను ఎంపిక చేసినట్టు సమాచారం. కొద్ది రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి క‌థానాయిక కోసం అన్వేష‌ణ జ‌రుపుతున్నారు. ఇందులోభాగంగా, పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించారు.
 
చివరకు అందాల భామ రాశీ ఖ‌న్నాని హీరోయిన్‌గా ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తోంది. చిత్రంలో హీరో పాత్ర‌కి స‌మానంగా హీరోయిన్ పాత్ర ఉంటుంద‌ట‌. రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా ఇటీవ‌ల వ‌చ్చిన చిత్రాల‌న్నీ మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ చిత్రం కూడా మంచి హిట్ కొడుతుంద‌ని భావిస్తున్నారు. 
 
మరోవైపు, విజయ్ దేవరకొండ కూడా వరుసబెట్టి చిత్రాలు చేస్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'గీత గోవిందం' ఆగ‌స్టు 15న విడుద‌ల కానుండ‌గా, 'టాక్సీవాలా' చిత్రం విడుద‌ల‌కి సిద్ధమవుతోంది. మ‌రో వైపు బైలింగ్యువ‌ల్ మూవీ 'నోటా' చేస్తున్నాడు. 'ఎవడే సుబ్రమణ్యం' సినిమా నిర్మించిన స్వప్నా సినిమాస్ బ్యానరులో స్వప్న దత్ నిర్మాతగా నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడట. 
 
ఇక అదేకాకుండా రాజు డి.కె. దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్ర‌స్తుతం భరత్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేక‌ర్స్‌‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ 'డియ‌ర్ కామ్రేడ్' అనే చేస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను కూడా ఇటీవలే విడుదల చేశారు కూడా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

నేను సీఎం చంద్రబాబును కాదమ్మా.. డిప్యూటీ సీఎం పవన్‌ను : జనసేన చీఫ్

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

విమానంలో మహిళపై అనుచిత ప్రవర్తన.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments