Webdunia - Bharat's app for daily news and videos

Install App

హే.. గాయ్స్... అనుష్కతో నటించడం లేదు : మాధవన్

Webdunia
ఆదివారం, 13 జనవరి 2019 (11:41 IST)
ఒకపుడు హీరోగా నటించిన ఆర్.మాధవన్.. ఇపుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు. ఇటీవల అక్కినేని నాగచైతన్య నటించిన 'సవ్యసాచి' చిత్రంలో విలన్ క్యారెక్టర్‌గా కనిపించాడు. ఇపుడు మరో చిత్రంలో నటిస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో త్వరలో లేడీ టైగర్ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రంలో మాధవన్ అత్యంత కీలక పాత్రను పోషించనున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని మాధవన్ స్వయంగా వెల్లడించారు. హే... గాయ్స్.. నేను అనుష్క చిత్రంలో నటించడం లేదు. దీనికి సంబంధించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదన్నారు.
 
మాధ‌వ‌న్ క్లారిటీతో అనుష్క సినిమాలో మాధ‌వ‌న్ న‌టించ‌డం లేద‌ని అర్థమైంది. మాధ‌వ‌న్ చేస్తున్న రాకెట్రీ చిత్రం ఇస్రో సైంటిస్ట్ నంబీ నారాయ‌ణ‌న్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 
 
మరోవైపు అనుష్క నటిస్తున్న థ్రిల్లర్ చిత్రానికి ప్రముఖ కథా రచయిత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మూవీ చిత్రీక‌ర‌ణ ఎక్కువ శాతం అమెరికాలో జ‌ర‌గ‌నుంది. ఈ చిత్రంలో హాలీవుడ్ న‌టులు కూడా న‌టిస్తార‌ని స‌మాచారం. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనుండగా, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Tirupati Stampede తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లకై తొక్కిసలాట: ఆరుగురు భక్తులు మృతి

ఆ 3 గ్రామాల ప్రజలకు ఒక్క వారం రోజులలో బట్టతల వచ్చేస్తోంది, ఏమైంది?

TSPSC-గ్రూప్ 3 పరీక్ష- కీ పేపర్స్ విడుదల.. మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు

ఖమ్మం పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు- ఒకే ఒక విద్యార్థి

Modi: విశాఖపట్నంలో ప్రధాని గ్రాండ్ రోడ్ షో.. పూల వర్షం కురిపించిన ప్రజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments