Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హ‌ర్షి టీమ్‌కి షాక్ ఇచ్చిన వంశీ..!

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (19:25 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు - టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిపల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హ‌గ్డే  నటిస్తుంటే...అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్పాట్ లోని కొన్ని ఫోటోలు అలాగే ఒక వీడియో కూడా లీకైన సంగతి తెలిసిందే. కొంత మంది ఆకతాయిలు, అత్యుత్సాహం ఉన్నవారు ఇలా ఫోటోలు షూటింగ్ వీడియోలు అలాగే ఎడిటింగ్ సమయంలో సినిమా క్లిప్స్‌ని లీక్ చేసిన సందర్భాలు మన తెలుగు సినీ పరిశ్రమలో చాలా ఉన్నాయి. కానీ ఈ లీకుల బెడద మాత్రం పోవ‌డం లేదు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...మ‌హ‌ర్షి సినిమాకి సంబంధించి ఏదోటి లీక‌వుతుండ‌డంతో ఈ సినిమా విషయంలో వంశీ ఇక నుంచి కాస్త పగడ్బందీగా వ్యవహరించాలని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అది ఏంటంటే... ఈ సినిమాకి పని చేసే ఏ ఒక్కరి దగ్గర ఆ సినిమా షూటింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు ఉండకూడదు అని ఆంక్షలు విధించినట్టు తెలిసింది. సినిమా షూటింగ్ మొదలు పెట్టే ముందే ఏ ఒక్కరు లొకేషన్ కి మొబైల్స్ తీసుకురాకూడదని ప్రతీ ఒక్కరికి స్ట్రిక్ రూల్స్ పెట్టి వంశీ షాకిచ్చాడ‌ట‌. అదీ..సంగ‌తి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments