హెచ్-1బి వీసా ఉద్యోగులకు అమెరికా కంపెనీలు చుక్కలు చూపిస్తున్నాయట. దీంతో ఈ వీసాలపై పని చేస్తున్న ఉద్యోగులు నిలువు దోపిడీకి గురవుతున్నట్టు సౌత్ ఆసియా సెంటర్ ఆఫ్ ది అంట్లాంటిక్ కౌన్సిల్ (ఎస్ఏసీఏసీ) నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది.
ఈ సంస్థ తాజాగా వెల్లడించిన నివేదిక మేరకు... హెచ్-1బీ విసా ఉద్యోగులకు వేతనాలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది. అలాగే, ఉద్యోగ హక్కులు కల్పించాలనీ తెలిపింది. ప్రస్తుతం హెచ్-1బీ వీసా వ్యవస్థ అమెరికన్లకు హానికరం. అలాగే హెచ్ 1బీ వీసాపై పని చేసే ఉద్యోగులు కూడా దోపిడీకి, వేధింపులకు గురవుతున్నట్టు పేర్కొంది.
వారికి తక్కువ జీతాలు చెల్లిస్తున్నారు. సరైన పని వాతావరణం కల్పించట్లేదని ఎస్‍ఏసీఏసీ తెలిపింది. ఉద్యోగులకు సరైన పని వాతావరణం ఉండేలా చూసుకోవాలని, మరిన్ని ఉద్యోగ హక్కులు కల్పించాలని తెలిపింది. అప్పుడే వారి జీవితాలు మెరుగవుతాయని వెల్లడించింది. ఈ రిపోర్టును హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన రోన్ హీరా, ఎస్‍ఏసీఏసీ హెడ్ భరత్ గోపాలస్వామి రూపొందించారు.