Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్టీస్టారర్ కాబోతున్న పుష్ప.. విక్రమ్ నటిస్తాడా?

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (15:35 IST)
లాక్ డౌన్ తర్వాత అల్లు అర్జున్ తన ఫోకస్ మొత్తం పుష్ప సినిమాపై పెట్టాడు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ గోదావరి జిల్లాలోని అడవి ప్రాంతంలో జరుగుతుంది. మరికొన్ని రోజులు అక్కడే చిత్రం షెడ్యూల్ ప్లాన్ చేశాడు దర్శకుడు సుకుమార్. ఇప్పటికే తొలి షెడ్యూల్ చివరి దశకు వచ్చింది. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు సుకుమార్. 2022 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. 
 
కేవలం తెలుగులోనే కాకుండా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో కూడా పుష్ప విడుదల కానుంది. దీనికోసం కథలో కూడా కొన్ని మార్పులు చేశాడు సుకుమార్. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ కథ ఉంటుందని.. ఆ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది అని చెబుతున్నాడు దర్శకుడు.
ఇందులో పుష్పక్ నారాయణ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. రష్మిక మందన హీరోయిన్. 
 
కథలో ఈమె పాత్ర కూడా కీలకంగా ఉండబోతుంది. పూర్తిగా డి గ్లామరస్ పాత్రలో నటిస్తుంది రష్మిక. దానికి తోడు రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్.. అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత అల్లు అర్జున్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా బిజినెస్ దాదాపు 200 కోట్లకు పైగా జరుగుతుందని అంచనా. 
 
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు సింగిల్ స్టారర్ సినిమాగా ఉన్న పుష్ప ఇకపై మల్టీస్టారర్ కాబోతుంది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉంది. దాని కోసం ఇప్పటికే విజయ్ సేతుపతి, సముద్రఖని, సుదీప్, బాబీ సింహ లాంటి నటుల పేర్లు వినిపించాయి. అయితే కొన్ని డేట్స్ కారణంగా.. మరికొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమా నుంచి వాళ్ల తప్పుకున్నారు. ఇప్పుడు ఈ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విక్రమ్‌ను దర్శకుడు సుకుమార్ అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

డబ్బు కోసం దుబై వెళ్లావ్, ఇక్కడున్న నాకు ఎవరితోనో లింక్ పెట్టావ్, చనిపోతున్నా: వివాహిత ఆత్మహత్య

భర్త హత్య కోసం యూట్యూబ్‌ వీడియోలు వీక్షించిన భార్య.. చివరకు గడ్డి మందు చెవిలో పోసి...

మద్యం మత్తులో 68 యేళ్ల అత్తపై అల్లుడి లైంగికదాడి..

ధరాలి పర్వత గ్రామంలో సహాయక చర్యలు.. ఒకరు మృతి 150మంది సేఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments