Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

దేవీ
మంగళవారం, 27 మే 2025 (18:24 IST)
Puri-setupati-charmi
 
 
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఇది పూర్తి స్థాయి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. పూరి సిగ్నేచర్ స్టైల్, విజయ్ సేతుపతి మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ బ్లెండ్ చేసే ప్రత్యేకమైన కథాంశంతో విభిన్నంగా ఉంటుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ నిర్మిస్తున్నారు. మొత్తం కాస్ట్ అండ్ క్రూ ఇప్పటికే ఖరారు కావడంతో, టీం ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై అంతటా రెక్కీ చేస్తున్నారు. మొదటి షూటింగ్ షెడ్యూల్ కోసం సరైన లొకేషన్ల కోసం వెతుకుతున్నారు.
 
జూన్ చివరి వారంలో షూటింగ్ ప్రారంభంకానున్న ఈ ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన కొలాబరేషన్ ని సూచిస్తోంది. పూరి జగన్నాథ్ క్రియేటివ్, టెక్నికల్ అంశాలన్నింటిలోనూ చాలా కేర్ తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఎంచుకున్న లొకేషన్లు విజువల్ స్టొరీ టెల్లింగ్ కి వున్న ప్రాధాన్యత సూచిస్తున్నాయి. విజయ్ సేతుపతి, ఇతర ప్రధాన నటుల మొదటి షెడ్యూల్ నుంచే షూటింగ్ లో పాల్గొనున్నారు.
 
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నెవర్ బిఫోర్ క్యారెక్టర్ కనిపించబోతున్నారు. ఎవర్‌గ్రీన్ నటి టబు, శాండల్‌వుడ్ డైనమో విజయ్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ భాషలలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లడఖ్‌లోని గల్వాన్‌లో సైనిక వాహనంపై పడిన బండరాయి: ఇద్దరు మృతి

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments