Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరి మెహబూబాను నాలుగోసారి, ఐదోసారి థియేటర్లకు వెళ్లి చూస్తున్నారా?

పూరి ఆకాష్‌ను హీరోగా పరిచయం చేస్తూ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ రూపొందించిన డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మెహబూబా’. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకం పైన పూరి కనెక్ట్స్‌ నిర్మాణంలో రూపొందిన ‘మెహబూబా’ ఇటీవల రిలీజైం

Webdunia
బుధవారం, 16 మే 2018 (17:20 IST)
పూరి ఆకాష్‌ను హీరోగా పరిచయం చేస్తూ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ రూపొందించిన డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మెహబూబా’. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకం పైన పూరి కనెక్ట్స్‌ నిర్మాణంలో రూపొందిన ‘మెహబూబా’ ఇటీవల రిలీజైంది. ఈ నేపథ్యంలో  హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో థాంక్స్‌ మీట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్‌. 
 
ఛార్మి మాట్లాడుతూ... సినిమాకి అన్ని ఏరియాల నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సినిమాని ఇంత పెద్ద హిట్‌ చేసిన ఆడియన్స్‌కి థాంక్స్‌. ఈ సినిమాకి అందరూ చాలా మంచి సపోర్ట్‌ అందించారు. ఇలాంటి సినిమాను థియేటర్స్‌లోనే చూడాలి. ఎందుకంటే సినిమాలోని విజువల్స్‌ని, సౌండ్‌ ఎఫెక్ట్స్‌ని ఎంజాయ్‌ చెయ్యాలంటే బిగ్‌ స్క్రీన్‌లోనే సాధ్యమవుతుంది. కాబట్టి అందరూ థియేటర్స్‌కి వెళ్ళి ‘మెహబూబా’ను చూడండి” అన్నారు.
 
పూరి ఆకాష్‌ మాట్లాడుతూ…సినిమాకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. చూసినవాళ్ళంతా చాలా బాగుందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమాని ఎంతో ఇష్టంగా చేశారు. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు నాన్నకి థాంక్స్‌. ఆ పదం చాలా చిన్నదని నా ఒపీనియన్‌. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు” అన్నారు.
 
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ…అమెరికాలో తెలుగు వాళ్ళ మధ్య కూర్చొని ప్రీమియర్‌ చూశాం. అందరికీ బాగా నచ్చింది. హైదరాబాద్‌లో థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూశాం. చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 
 
నాలుగోసారి, ఐదోసారి చూసినవాళ్ళను కూడా నేను కలిశాను. ఆకాష్‌ని బాగా అప్రిషియేట్‌ చేస్తున్నారు. రెగ్యులర్‌గా నేను తీసే సినిమాల్లా ఉండదు. కమర్షియల్‌ సాంగ్స్‌, ఐటమ్‌ సాంగ్స్‌ వంటివి లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే లవ్‌స్టోరీ చేశాను. నా కెరీర్‌లో నేను బాగా మనసు పెట్టి తీసిన సినిమా ఇది. ఫ్యామిలీతో కలిసి అందరూ చూడండి. మా సినిమాకి పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్‌” అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments