పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో "అర్జున్ రెడ్డి" దర్శకుడి చిత్రం

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2023 (09:08 IST)
అల్లు అర్జున్ ఈ పేరుకి ఇప్పుడు కొత్తగా పరిచయం అవసరం లేదు. "పుష్ప" ముందు వరకు తెలుగు ప్రేక్షకులలో వీపరీతమైన క్రేజ్ ఉన్న అల్లు అర్జున్, 'పుష్ప' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ను సంపాదించాడు. తనదైనశైలితో 'పుష్ప రాజ్' ప్రపంచ వ్యాప్తంగా ఒక ఊపు ఊపాడు. బాక్సాఫిస్ వద్ద కలక్షన్స్ సునామి సృష్టించాడు. తాజాగా ఐకాన్ స్టార్, 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో సినిమాను చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 
 
అర్జున్ రెడ్డి సినిమాతో యూత్‌ను, సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. దర్శకుడిగా మొదటి సినిమాతోనే తనదైన ముద్రను వేసి భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు సందీప్ రెడ్డి వంగ. 
 
సందీప్ రెడ్డి వంగ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమాను చేయనున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను టీ సిరీస్ ప్రొడక్షన్స్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించనున్నారు. 
 
గతంలో అర్జున్ రెడ్డి సినిమా అల్లు అర్జున్ చేసుంటే ఇంపాక్ట్ గట్టిగ ఉంటుంది అని దర్శకుడు సందీప్ పలుసార్లు చెప్పుకొచ్చాడు. ఈసారి అల్లు అర్జున్‌తో సినిమా చేయనున్న సందీప్ ఐకాన్ స్టార్‌ను ఏ రేంజ్‌లో చూపించనున్నాడో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలపడుతున్న ఉపరితల ఆవర్తనం : తెలంగాణాలో మళ్లీ కుండపోతవర్షాలు

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు

ఏపీ గ్రామీణ స్థానిక సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.410.76 కోట్లు

AP: ఏపీలో రాజ్‌భవన్‌ నిర్మాణానికి సీఆర్డీఏ ఆమోదం

అయోధ్యలో భారీ పేలుడు.. భవనం కూలి ఐదుగురు దుర్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments