Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుష్ప 2 కోసం యాక్షన్‌ సీన్స్‌ చేస్తున్న సుకుమార్

Advertiesment
pushpa on location
, బుధవారం, 25 జనవరి 2023 (18:05 IST)
pushpa on location
అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా సినిమా పుష్ప2. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే విశాఖపట్నం సమీపంలో ప్రారంభమైంది. అల్లు అర్జున్‌ సరికొత్తగా హెయిర్‌ స్టయిల్‌ పెంచి సెట్లోకి ప్రవేశించారు. మొదటి భాగంకంటే ఇందులో ఎక్కువ యాక్షన్‌ సీన్స్‌ వున్నాయని తెలుస్తోంది. సుకుమార్‌ టీమ్‌ ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్‌ చేసింది. అడవి ప్రాంతంలో యాక్షన్‌ సీన్‌ చేస్తున్న సీన్‌ను చూపించింది. ఫారిన్‌ యాక్షన్‌ ఫైట్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది.
 
అలాగే ఈ సినిమాలో రష్మిక మందన్న నటిస్తోంది. తనకు సంబంధించిన సీన్స్‌ వచ్చే నెలలో వుంటాయని. అప్పుడు జాయిన్‌ అవుతాయని సోషల్‌ మీడియాలో తెలిపింది.  ‘ది బాయ్స్’  షూట్లో ఉన్నారు.  అల్లు అర్జున్,  ఇతర నటీనటులు ఈ చిత్రం షూట్‌ను ప్రారంభించగా, వచ్చే నెలలో తాను షూట్‌లో జాయిన్ అవుతానని షేర్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటుడు సుధీర్‌ వర్మ మృతి పై అనుమానాలు!